eRoju - Hot News

Monday, May 25, 2009

18, 20 LOVE STORY Telugu Movie Review

Movie Name 18,20 లవ్ స్టోరీ Rating : 2/5

Banner శిల్పి క్రియేషన్స్

Producer తొండపు నాగేశ్వరరావు,కొప్పుల రమేష్

Director రాధాకృష్ణ

Music శ్రీమురళీ

Photography జి.శివకుమార్

Story రాధాకృష్ణ

Dialouge రాధాకృష్ణ

Lyrics

Editing బస్వాపైడిరెడ్డి

Art సి.హెచ్.కృష్ణ

Choreography కృష్ణారెడ్డి, క్రిష్ణ

Action నందు,ఆనంద్


Star Cast శివాజీ,
శ్రద్దాదాస్‌‍,
మనోజ్‍,
వినోద్‌‍,
చిన్నా,
ఝాన్సీ,
ఉత్తేజ్‍,
యమ్.యస్‌‍.నారాయణ,
భణీశంకర్,
ప్రగతి తదితరులు...

Rating
2/5
Release Date
22-5-2009
Story
జె.బి.(వినోద్) అనే ఒక పెద్దమనిషికి అవసరమైన అసాంఘీక కార్యక్రమాలు చేసే ఒక గూండా బుల్లన్న (శివాజీ),అతను మారాలని తపనపడే అతని తల్లి (ప్రగతి)ఉంటారు.జె.బి.కూతురూ,అతని భార్య కలసి ఒక పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూండగా యాక్సిడెంట్‍ జరుగుతుంది.వారికి ఒక ధాబా కుర్రాడు మనోజ్‍ (మనోజ్‍) సహాయం చేస్తాడు.అతని తల్లి,తండ్రి కూడా వారికి అవసరమైన సపర్యలుచేస్తారు.ఆ సందర్భంలో జె.బి.కూతురు రూపిణి మనోజ్‍తో ప్రేమలో పడుతుంది.కానీ జె.బి.కి ఇది ఇష్టముండదు.అతను బుల్లన్నను మనోజ్‍కి బుద్ధిచెప్పమని పురమాయిస్తాడు.బుల్లన్న మనోజ్‍ తండ్రిని పొడుస్తాడు.కానీ ఒకప్పుడు బుల్లన్నకు యాక్సిడెంటయితే కాపాడింది మనోజ్‍ తండ్రేనన్న సంగతి బుల్లన్న తల్లికి తెలుస్తుంది.తన తండ్రిని చంపిన వాళ్ళల్లో ఒక వ్యక్తి దొరకగానే,వాణ్ణి చంపబోతే బుల్లన్న తల్లి అతన్ని వారిస్తుంది.మనిషిగా మారమని తీవ్రంగా చెపుతుంది.బుల్లన్న ఇంటికి మనోజ్‍ కుటుంబాన్ని తిసుకు వస్తుంది బుల్లన్న తల్లి.మనోజ్‍ బాధ్యతను బుల్లన్నకే అప్పగిస్తుందామె.
భారతి (శ్రద్ధాదాస్)ఒక అనాథశరణాలయాన్ని నడుపుతూంటుంది.దాన్ని కొందరు గుండాలు కబ్జాచేయటానికి ప్రయత్నిస్తుంటె,ఆమె బుల్లన్న సహాయం కోరుతుంది.ఆమె అంటే మనసుపడ్డ బుల్లన్న ఆ గూండాల బారినుండి అనాథశరణాలయాన్ని కాపాడతాడు బుల్లన్న.లండన్‌కి వెళ్ళిన జే.బి.తిరిగిరాగానే,మనోజ్‍,రూపిణిల పెళ్ళి గురించి అడుగుతాడు బుల్లన్న.పైకి వొప్పుకున్నట్టే నటించి,మనోజ్‍ని చంపటానికి తన ప్రయత్నాలు తాను చేస్తాడు జె.బి.మనోజ్‍, రూపిణిల ప్రేమ సక్సస్సయ్యిందా...? లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Analysis
ఈ సినిమా దర్శకుడు గతంలో 'చిరంజీవులు'అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.సినిమా తొలి సగమంతా చాలా స్లోగా నత్తనడక నడుస్తుంది.ఈ చిత్రం మనోజ్‍, రూపిణల ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా..ఏదో ఒకటి రెండు సీన్లు తప్పిస్తే,మిగతా అంతా వీర బోర్ కొడుతుంది.శివాజీ ఎంటరైన దగ్గర నుండి సినిమాకి జీవమొస్తుంది.ఈ సినిమాలో శివాజీ లేకపోతే ఈ సినిమా చూట్టం కూడా అనవసరం.స్క్రీన్‌ప్లే చాలా బలహీనంగా ఉంది.టేకింగ్‍ అక్కడక్కడ తప్ప చాలా పాత పద్ధతిలో సాగింది.దర్శకత్వం యావరేజ్‍గా ఉంది.
Perspective
నటన -: ఈ చిత్రంలో తెలంగాణా యాశతో శివాజీ ఒక గూండాలా జీవించాడని చేప్పొచ్చు.అతని బాడీ లాంగ్వేజ్‍ కానీ,డైలాగ్ మాడ్యూలేషన్‌గానీ, అతని హావభావాలు కానీ ఒక కొత్త శివాజీని ఈ చిత్రంలో మనకు చూపిస్తాయి.ఒక విధంగా చెప్పాలంటే శివాజీ ఈ చిత్రాన్ని ఒంటిచేత్తో లాక్కొచ్చాడని చెప్పవచ్చు. శ్రద్దాదాస్‌ తన పాత్ర వరకూ బాగానే చేసింది.బాలనటుడు భరత్‌కు అవసరానికి మించిన పాత్రనిచ్చి చెడగొట్టారు.అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతని కామేడీ పెద్దగా పండింది లేదు. మనోజ్‍ కొత్త కుర్రాడైనా బాగానే చేశాడు.'ఛత్రపతి'చిత్రంలో బాల ప్రభాస్‌లా నటించిన పిల్లాడే ఈ మనోజ్‍.ఇక రూపిణి పాత్రధారి ఈ చిత్రానికున్న మైనస్‌లలో మరో పెద్ద మైనస్.శివాజీ తల్లి పాత్రధారిణి శివాజీ మార్చే సీన్లో బాగా నటించింది.వినోద్ షరా మామూలుగానే నటించాడు.ఝాన్సీని ఈ చిత్ర దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు.ఇక ఉత్తేజ్‍, యమ్‌యస్‌ నారాయణలు చెరి ఒక సిస్‌కే పరిమితమయ్యారు.
సంగీతం -: ఈ సినిమాకి ఇదో పెద్ద మైనస్ పాయింట్‍.రీ-రికార్డింగ్ అవసరమైన స్థాయిలో లేదు.ఇక పాటల్లోని ట్యూన్లన్నీ గతంలో విన్నట్లుగానే ఉన్నాయి.
కెమెరా -: వెరీ పూర్ ఫొటోగ్రఫీ.లైటింగ్ సెన్స్ కానీ,క్లారిటీ గానీ,ఏ అనుభవం లేకుండా తొలిసారి కెమెరా పట్టుకున్న కేమేరామేన్‌లా ఉన్నాయి. అనుభవరాహిత్యం,నిర్లక్ష్యం ఈ చిత్రంలోని ఫొటోగ్రఫీ లో కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి.
ఎడిటింగ్ -: ఇది కొంచెం ఫరవాలేదు.
యాక్షన్ -: యావరేజ్‍గా ఉంది.
ఈ సినిమా శివాజి నటనలోని వెరైటీ కోసం ఒకసారి చూడొచ్చు.తప్పితే ఇదేం పేద్ద చూడతగ్గ చిత్రమేం కాదు.

No comments: