|
Rating | ||
3.25/5 | ||
Release Date | ||
29-05-2009 | ||
Story | ||
ఇది కథగా చాలా సింపుల్ కథ. ఒకబ్బాయి మలేసియా ఏయిర్‌పోర్ట్ లో, ఒకమ్మాయిని చూసి చూడంగానే ప్రేమలో పడి, తన ప్రేమని సఫలం చేసుకోవటం ఈ చిత్ర కథ. కానీ ఈ కథని స్క్రీన్ మీద అందంగా చూపించటం దర్శకుని ప్రతిభ. ఇక కథలోకి వస్తే ధృవ్ (మనోజ్), కైలాష్, రామన్ అనే ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ధృవ్‌కి ప్రయాణం అంటే చాలా ఇష్టం. రామన్ సైకాలజీ స్టూడెంట్. కైలాష్ సినిమాలకు కథలు వ్రాయాలనుకుంటాడు.వీళ్ళు ముగ్గురూ మలేసియా చూట్టానికి వెళతారు. కైలాష్‌కీ, ధృవ్‌కీ మధ్య చిన్నప్పటి నుంచీ పోటీ ఉంటుంది. అంటే పందాలు కాయటం అన్నమాట. అలా మలేసియాలో కూడా ఒక పందెం కాసుకుంటారు. అక్కడి ఒక బ్రిడ్జ్ మీదకు ఎవరు ముందుగా పాకుతారో వాళ్ళు గెలిచినట్టుగా పందెం కాసుకుంటారు. కానీ వీళ్ళా బ్రిడ్జ్ ఎక్కుతూండగానే మలేసియా పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అక్కణ్ణించి ఫైన్ కట్టి బయటపడతారు ఈ ముగ్గురు స్నేహితులు. వీళ్ళు అక్కణ్ణించి సింగపూర్ వెళదామనుకుని మలేసియా ఎయిర్‌పోర్ట్ కి చేరుకుంటారు.అదే సమయానికి హారిక అనే అమ్మాయి తన పెళ్ళిచూపుల కోసం స్నేహితురాలితో కలసి ఇండియాకి బయలుదేరుతుంది. అక్కడ మళ్ళీ కైలాష్, ధృవ్ వేసుకున్న ఒక పందెం వల్ల హారికతో ఒక చిన్నసైజ్ సర్కస్ చేస్తాడు ధృవ్. అలా ఆమెను చూడగానే ధృవ్ ప్రేమలో పడతాడు. రెండేళ్ళు వెంటపడినా ప్రేమ సఫలం కావటం కష్టమైన ఈ రోజుల్లో, రెండు గంటల్లో ధృవ్ తన ప్రేమను ఎలా గెల్చుకున్నాడు, చివరికి హారిక అతని ప్రేమను అంగీకరించిందా...?లేదా....అన్నది మిగిలిన కథ. | ||
Analysis | ||
ఇలాంటి కథను అంటే ఒక ఎయిర్ పోర్ట్ లో ఓ రెండు గంటల పాటు జరిగే ప్రేమకథను ఒక్క ఫై టు లేకుండా,ఏ క్రైమూ,సస్పెన్సూ లేకుండా సినిమాగా తీయటం అనేది అతిపెద్ద సాహసం.అయితే తన మీద తనకు నమ్మకమున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చక్కని స్క్రీన్‍ప్లేతో ఈ కథను మరింత చక్కని కథనంతో నీట్‍గా ప్రెజేంట్ చేశాడు.సినిమా తొలి సగం కొంచెం నిదానంగా ఉందనిపించినా,సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి అది మనక్కనపడదు.ఈ చిత్రంలో కొత్తదనం విషయానికొస్తే కొత్తదనాన్ని కోరే ప్రేక్షకులకు కావలసినంత కొత్తదనం ఈ చిత్రంలో ఉంటుంది.ఇదొక నీట్,క్లీన్ అండ్ డీసెంట్ లవ్ స్టోరీ.ఈ చిత్రంలో హీరో సినిమా చివరి వరకూ హీరోయిన్ని తాకడు(సందర్భోచితంగా తప్ప).కథలో ఫ్రెష్ నెస్ ఉంది.కథనంలో కూడా కొత్తదనం ఉంది.ఈ చిత్రాన్ని తనే తీయటం దర్శకుడి ధైర్యానికీ,ఆత్మవిశ్వాసానికీ నిదర్శనం. | ||
Perspective | ||
నటన -: నటన విషయానికొస్తే మనోజ్ నటన చాలా కొత్తగా ఉంటుంది.అతని బాడీ లాంగ్వేజ్ కానీండీ,అతని హావభావాలు కానీండి, అతని డైలాగ్ మాడ్యూలేషన్కానీండి ఈ సినిమాలో చాలా చాలా కొత్తగా ఉంటాయి. అతని గత చిత్రాలతో పోలిస్తే అతని నటనలో కనపడని పరిణితి మనకీ ఈ చిత్రంలో కనిపిస్తుంది.ఇక హారిక నటన డీసెంట్‍గా ఉంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ బాగుంది.ఆ హాస్యం కూడా చాలా సున్నితంగా గిలిగింతలు పెట్టేలా ఉంది. ఒక నీగ్రో కుటుంబంతో ఈ చిత్రంలో చక్కని కామెడీ పండించారు. దానికి బ్రహ్మానందానికి పెట్టిన లింకు బాగుంది. కైలాష్ పాత్రధారి, రామన్ పాత్రధారి బాగానే నటించారు. సంగీతం -: సంగీతం విషయంలో పాటలు యావరేజ్‍గా ఉన్నాయి. ఈ చిత్రంలో ఉన్నవే రెండు పాటలు. కానీ రీ-రికార్డింగ్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ -: బాగుంది. కెమెరా -: ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్వేష్ మురారీ కెమెరా పనితనం. ఈ సినిమా ఎంతందంగా చూపించాలో అంతందంగానూ చూపించాడతను. ఒక ఎయిర్‌పోర్ట్ ని రెండుగంటల పాటు బోర్ కొట్టకుండా చూపించటంలో కెమెరాపనితనం మనకర్థమవుతుంది. కొరియోగ్రఫీ -: మామూలుగా కొరియోగ్రఫీ అనగానే డ్యాన్సూ, స్టెప్పులూ అనుకుంటారు. కానీ కొరియోగ్రఫీ అంటే అధికాదని ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ మనకు చెపుతుంది. కాన్సెప్ట్ బేస్డ్ కొరియోగ్రఫీని ఈ చిత్రంలో నోబుల్ చాలా చక్కగా కంపోజ్ చేశాడు. మీరు సకుటుంబంగా ఒక కొత్తరకం కథతో కొత్తగా ఉండే సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. మరీ అంత గొప్పగా, అద్భుతంగా లేకపోయినా ఈ చిత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. |
No comments:
Post a Comment